top of page
అపరోక్షానుభూతి
ఆదిశంకరులచే రచింపబడి మనకు లభిస్తున్న గ్రంథములలో మణిపూస వంటిది ఈ అపరోక్షానుభూతి. జ్ఞానమార్గసాధన ఈ గ్రంథములో మెట్టుమెట్టుగా వివరింపబడినది. సాధనామార్గమున కావలసిన అర్హతలైన సాధనాసంపత్తిని వివరించిన తర్వాత, ఆత్మ యన్నది దేహం కాదని అనేక ఉదాహరణల ద్వారా చెప్పి, ఆపైన, దేహం కూడా ఆత్మలో భాగమేనని ఆచార్యులవారు వివరించారు. ఉన్నది ఆత్మయేనని, దేహమనిన భావన ఒక భ్రమమాత్రమేనని, ఆ ఆత్మ కూడా బ్రహ్మమే దప్ప వేరొకటి కాదనిన బోధనలు ఈ గ్రంథంలో లభిస్తున్నాయి. చివరిగా, ఈ బ్రహ్మానుభూతిని అందుకునే క్రమంలో, పదిహేను మెట్లతో కూడిన యోగ, జ్ఞానమార్గముల మిశ్రమం సాధనాపరంగా ఉపదేశింపబడింది. అద్వైతాభిమానులకు మా వ్యాఖ్యానం మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాం.
Purchase Ebook on
Select Print Books are available on Amazon
bottom of page