ఆత్మబోధ
అపౌరుషేయములైన వేదమంత్రములకు, మహావాక్యములకు, ప్రస్థానత్రయమునకు అద్వైతసిద్ధాంతరీత్యా వ్యాఖ్యానమును గావించి, అద్వైతమును పరమతార్కికమతముగా లోకమున ప్రతిష్ఠించిన ఘనత ఆదిశంకరాచార్యులవారికి చెందుతుంది. వీరి గ్రంథములలో ఆత్మబోధ చాలా చిన్నది. కానీ భావగాంభీర్యములో చాలా లోతైనది. కేవలము 68 శ్లోకములలో, అద్వైతవేదాంత సిద్ధాంతమును ప్రతిపాదించడమే గాక, నిత్యజీవితములో మనకు ఎదురయ్యే అనేక సులభమైన ఉదాహరణల సహాయంతో దాని లోతుపాతులను వివరించిన ఘనత ఆచార్యులవారి పాండిత్యానికి, జ్ఞానపరాకాష్ఠకు నిదర్శనమై యున్నది.
ఈ గ్రంథమునకు ఎందరో పండితులు, మహనీయులు వ్యాఖ్యానములు వ్రాసినారు. నా అవగాహనరీత్యా నేను కూడా ఒక చిన్న ప్రయత్నం చేశాను. ‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ నుండి వస్తున్న మొదటి అద్వైతవేదాంత గ్రంథమిది.
జ్ఞానమార్గావలంబులైన చదువరులకు ఈ గ్రంథము మిక్కిలి ఉపలబ్దంగా ఉంటుందని ఆశిస్తున్నాం.