top of page

తంత్రసారము

Image-empty-state.png

పదవశతాబ్దము నందు కాశ్మీర్ లో నివసించిన శ్రీ అభినవగుప్తుల వారు, కాశ్మీరశైవమని పిలువబడుతున్న శివాద్వైతము లేదా త్రికసిద్ధాంతము నందు మహా పండితులే గాక, పరమశివానుభవమును పొందిన మహా తపశ్శాలి, తంత్రసిద్ధుడూ అయి ఉన్నారు. స్పంద, క్రమ, కుల, ప్రత్యభిజ్ఞములనే విభాగములతో విరాజిల్లుతున్న త్రికశాస్త్రమును ఔపోసన పట్టిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి రచించిన అనేక గ్రంథములలో, శైవాగమముల సారమని చెప్పదగిన తంత్రాలోకము సుప్రసిద్ధమైనది. అనేక వేల శ్లోకములతో బహువిస్తారముగా ఉన్న ఈ గ్రంథమును అల్పబుద్ధులు గ్రహించలేకపోతున్నందు వలన, దానిని కుదించి, సులభవచనంలో ‘తంత్రసారము’ అనే గ్రంథమును ఆయన రచించారు. ఈ సంస్కృతగ్రంథమును జిజ్ఞాసువుల ఉపయోగార్థమై తెలుగుభాషలోకి తేగలగడం పరమేశ్వర కటాక్షంగా భావిస్తున్నాము.

Purchase Ebook on

google-play-badge.png

Select Print Books are available on Amazon

bottom of page