రామతాపిన్యుపనిషత్

అయోధ్యా నగరంలోని శ్రీరామచంద్రుని భవ్యమందిరం 1528-29 CE లో బాబర్ చేత ధ్వంసం చేయబడింది. అప్పటినుండి బానిసత్వంలో బ్రతుకుతున్న హైందవజాతి, దురాక్రమణదారులు ఆ స్థలంలో కట్టిన కట్టడాన్ని ఆ తరువాత 465 ఏళ్లకు 1992 CE లో ధ్వంసం చేయగలిగింది. ఈ క్రమంలో జరిగిన పోలీస్ కాల్పులలో ఎందరో కరసేవకులు తమ ప్రాణాలను కోల్పోయారు. అయినా సరే, పట్టువిడవని దీక్షతో శ్రమించి, ఎన్నో చట్టపరమైన అడ్డంకులను దాటి, ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి, స్వతంత్రం వచ్చిన 76 ఏళ్లకు అదే ప్రదేశంలో రామమందిరాన్ని తిరిగి నిర్మించడం జరిగింది. అక్కడ రామచంద్రుని భవ్య విగ్రహ ప్రాణప్రతిష్ట 22 జనవరి 2024 న జరుగుతున్నది. ఈ సందర్భంగా శ్రీరామచంద్రుని దివ్య చరణకమలముల మ్రోల ఈ ఉపనిషత్తుకు నా వ్యాఖ్యానమును ఉడతాభక్తిగా సమర్పిస్తున్నాను.
హైందవులందరికీ ఈ పుస్తకమును, దీని ఇంగ్లీష్ అనువాదమును, ఉచిత ‘ఈ-బుక్స్’ గా అందిస్తున్నాము. త్వరలో ప్రింట్ పుస్తకాలుగా కూడా వస్తాయి.