top of page

శ్రీవిద్యా రహస్యం

Image-empty-state.png

తంత్రసాధనయైన ‘శ్రీవిద్యోపాసనా’ మీద చిక్కని గ్రాంథిక భాషలో అనేక గ్రంథములున్నవి. వాటిలో సామాన్యునకు అర్థంకాని పదజాలము కనిపిస్తూ, అంతుబట్టని మంత్రములను పూజలను తంతులను సూచిస్తూ చదువరులను గందరగోళంలో పడేస్తూ ఉంటుంది. అటువంటి శైలికి భిన్నంగా, సామాన్యునకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో, తేలికభాషలో ‘శ్రీవిద్య’ యొక్క సాత్విక ఉపాసనావిధానం మొత్తం ఈ పుస్తకంలో వివరించబడింది. ముఖ్యమైన కొన్ని ఉపనిషత్తులలోని మంత్రములను తేలికభాషలో వివరిస్తూ, శ్రీవిద్యకు గల వేదప్రామాణికత ఇందులో చక్కగా నిరూపించబడింది. అంతేగాక, శ్రీవిద్యలోగల నాలుగు ఆచారములను, మానవుని దైవం వైపు అడుగులు వేయించే వాటి సాధనా విధానములను చదువరులకు పరిచయం చెయ్యడం జరిగింది.

తంత్రసాధన, జగజ్జనని ఉపాసనలంటే లోకంలో ఉన్నభయాలను, అయోమయాలను పటాపంచలు చేస్తూ, శ్రీవిద్యాసాధన మొత్తం సరళమైన పద్యం, అంతకంటే సరళమైన వచనంలో ఈ పుస్తకంలో వివరించబడింది. ఈ పుస్తకమును చదివిన తదుపరి, జీవనసాఫల్యతనిచ్చే అసలైన శ్రీవిద్యాసాధన వైపు చదువరులు ఆకర్షితులైతే రచయిత ఉద్దేశ్యం నేరవేరినట్లేనని భావిస్తాము.

Purchase Ebook on

google-play-badge.png

Select Print Books are available on Amazon

bottom of page