top of page
స్వరచింతామణి

స్వరచింతామణి యనే ఈ ప్రాచీనగ్రంథము పేరుకు తగినట్లు, చింతలను తీర్చే మణి వంటిది. దీని రచయిత శ్వేతకేతు యోగి. ఇది కూడను తంత్రశాస్త్ర విభాగమే. ఈ గ్రంథములో పిండోత్పత్తి, స్వరోత్పతి, కాలప్రమాణములు, నాడీసంధి, అజపాలక్షణము, స్వరకర్మ, వార, పక్ష, మాస, సంవత్సర స్వరములు, మూలస్వర విజ్ఞానము, నిత్యజీవితములో ఈ శాస్త్రము యొక్క వివిధములైన ఉపయోగములు, ప్రశ్నశాస్త్రములో దీనిని ఉపయోగించి ఫలితములను తెలుసుకునే విధానములు, సంవత్సర, మాస, దిన ఫలితములు, యుద్ధము, జూదము, ఉత్తమ స్త్రీ పురుష లక్షణములు, స్వప్నజ్ఞానము, వశీకరణము, సంతానము, రోగముల నిర్ధారణ, మరణసమయము, శకునములు, సాముద్రికజ్ఞానము మొదలైన అనేక విషయములు వివరించబడినది.
‘పంచవటి’ నుండి వెలువడుచున్న 62వ గ్రంథముగా దీనిని విడుదల చేయుచున్నాము.
Purchase Ebook on
Select Print Books are available on Amazon
bottom of page